ఇటీవల సినీ సెలబ్రిటీస్ పై సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లు ఎలా ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారో చూస్తూనే వస్తున్నాం . తాజాగా వాళ్ళ జాబితాలో పహ్లాజ్ నిహలానీ చేరిపోయారు.  భారతీయ చలనచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది . అగ్ర దర్శక నిర్మాత చాలా పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి . అంత సాదాసీదాగా తీసిపడేసే పేరు కాదు.  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ మాజీ చైర్మన్ కూడా.  తాజాగా ఈయన సినీ స్టార్స్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమానమే రేపుతున్నాయి .


బాలీవుడ్ ఇండస్ట్రీలో విషపూరిత సంస్కృతిని విమర్శించడం సంచలనంగా మారింది . ఇటీవల లర్న్ ఫ్రం ది లెజెండ్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆయన సినీ లైఫ్ సినీ స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఎలాంటివి జరుగుతాయి అనే విషయాలను ఉన్నది ఉన్నట్లు చెప్పుకొచ్చాడు . మరీ ముఖ్యంగా సినీ స్టార్స్ ..స్టార్ సెలబ్రిటీ జీవనశైలి ఆకర్షణమైన ముఖ భాగాల వెనుక దాగి ఉన్న నిజస్వరూపం గురించి ఒక్క మాటలో బయటపెట్టేసారు. " ఒకప్పుడు నటుడు మాత్రమే కనిపించేవారని ఇప్పుడు నటుడితో పాటు పదిమంది బృందాలు కూడా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.  నిన్న కాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరో కూడా మా మేకప్ మాన్.. మేకప్ ఆర్టిస్ట్ . హెయిర్ డ్రసర్ అంటూ ఒక పది మందిని వెనకేసుకొని తిరుగుతున్నారు అని .. తమ అద్దం పట్టుకోడానికి కూడా పర్సన్ అసిస్టెంట్ కావాలనుకుంటున్నారు అని వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ వ్యక్తిగత డైటీషియన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్స్ ఫాలో అవుతున్నారని చెప్పుకొచ్చారు ".



అంతేకాదు పొద్దటి నుంచి సాయంత్రం వరకు రకరకాల డైట్ అంటూ ఆరోగ్యకర ఆహారం డిమాండ్ చేస్తూ ఉండే స్టార్స్ రాత్రి అయితే మత్తు పదార్థాల వినియోగంలో మునిగిపోతున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు . తారలు తరచుగా ప్రాథమిక సేవ కోసం పెంచిన బిల్లులను సమర్థిస్తారని మేకప్ ఖర్చుల లక్షల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.  చిత్ర పరిశ్రమంలో మాదకద్రవ్యాల సంస్కృతి ఇప్పటికి కొనసాగుతుంది అంటూ ఆయన తేల్చి చెప్పారు . అంతేకాదు కొంతమంది నటుల ప్రవర్తనలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. దీనితో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: