సినిమా ఇండస్ట్రీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో నటులు , దర్శకులు చాలా డెడికేషన్ తో ఉంటారు. కొంత మంది కొన్ని సన్నివేశాలను రూపొందించేటప్పుడు నటులకు పెద్దగా గాయాలు కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక కొంత మంది దర్శకులు కాస్త గాయం అయినా పర్లేదు రియాలిటీగా రావడం కోసం , సీన్ పండడం కోసం నటులను కాస్త కష్టపెడుతూ ఉంటారు. ఇక కొంత మంది నటులు కూడా సీన్ అద్భుతంగా రావడం కోసం , జనాలు ఆ సన్నివేశానికి కనెక్ట్ కావడం కోసం కాస్త కష్టం అయినా పర్లేదు గాయాలను కూడా తింటూ ఉంటారు. ఇకపోతే ఓ సినిమా విషయం లోనే ఇలానే జరిగినట్లు ఏకంగా తన కుమారుడు సినిమా కోసం చెప్పు దెబ్బ కూడా తిన్నట్లు ఓ స్టార్ నిర్మాత చెప్పుకొచ్చాడు. ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాతలలో ఏ ఏం రత్నం ఒకరు.

ఏ ఏం రత్నం కుమారుడు అయినటువంటి రవి కృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం 7/G బృందావన్ కాలనీ అనే సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఏ ఏం రత్నం  ఈ సినిమా సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా ఏ ఏం రత్నం మాట్లాడుతూ ... 7/G బృందావన్ కాలనీ మూవీ లో బస్సులో ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సోనియా అగర్వాల్ వెనుక రవి కృష్ణ ఉంటాడు. ఇక ఒక్క సారిగా బస్సు సడన్ బ్రేక్ వేయగానే రవి కృష్ణ చెయ్యి సోనియా బ్లౌజ్ లోకి వెళ్ళిపోతుంది. దానితో రవి కృష్ణ కావాలనే ఆ పని చేశాడు అనే ఉద్దేశంతో సోనియా అతన్ని గట్టిగా చంపపై చెప్పుతో కొడుతుంది. ఇక ఆ సన్నివేశంలో సోనియా నిజం గానే మా వాడిని చెంపపై చెప్పుతో కొట్టింది. దానితో మా వాడి చెంప ఉబ్బింది. దానితో మూడు రోజుల పాటు షూటింగ్ కూడా షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింది అని తాజాగా ఏ ఏం రత్నం చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: