చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాకి భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిచ్చిన సినిమాలు ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా ప్లాఫ్ కాలేదు. సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీమ్, భగవంత్ కేసరి,ఎఫ్ టు,ఎఫ్ త్రీ వంటి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. ఇక వరుసగా ఈయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమాపై కూడా భారీ హైప్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొనని నయనతారతో కూడా రూల్ బ్రేక్ చేయించి ఆమెతో కూడా ప్రమోషన్ చేయించారు. అలా మెగా 157 సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా వస్తున్న ఈ సినిమా లో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో రాబోతున్నట్టు కూడా కన్ఫర్మ్ అయింది.

 ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాకి రెండు మూడు టైటిల్స్ ని అనిల్ రావిపూడి ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే..అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాకి మన శంకర వర ప్రసాద్ గారు అనే టైటిల్ పెట్టి దానికి ఒక మంచి ట్యాగ్ లైన్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ టైటిల్ బాలేక పోతే మరో రెండు టైటిల్ లను కూడా అనుకున్నారట. ఇక టైటిల్ విషయంలో అంతా ఓకే అయితే మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కి మెగా 157 సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. మరి చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమాకి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ నే ఉంచుతారా.. లేక ఆలోపు మరో టైటిల్ ని ఆలోచిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

 ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సాహు గారపాటి నిర్మాతగా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా త్వరలోనే ఈ సినిమాలోని రెండు పాటలను చిత్రీకరించడం కోసం అలిప్పీ వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇక అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి రాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. మరి చూడాలి చిరంజీవి సినిమా మెగా 157 మూవీకి టైటిల్ గా మన శంకర వరప్రసాద్ గారు అని పెడతారా.. లేక వేరే ఆలోచిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ చిరంజీవి రియల్ నేమ్ పెడితే కాస్త సెంటిమెంట్ కలిసి వస్తుందని కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: