టాలీవుడ్ లో విలన్ గా..హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..ఇండస్ట్రీలో కొనసాగుతున్న విభిన్న పాత్రలు పోషించే నటుడు జగపతిబాబు అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు ప్రస్తుతం పవర్ ఫుల్ విలన్ గా మారిపోయారు.ఈయన విలన్ గా నటించినా లేదా హీరో హీరోయిన్లకు తండ్రి, మామ పాత్రల్లో నటించినా ఆ పాత్రకి పూర్తి న్యాయం చేస్తారు.. ఆయన చేసే సినిమాకు 100% ఇస్తారు.అయితే అలాంటి జగపతి బాబు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో షాకింగ్ విషయాలు బయటపెడుతూ ఉంటారు. ముఖ్యంగా జగపతిబాబుకి ఇద్దరు కూతుర్లనే సంగతి మనకు తెలిసిందే. 

అయితే ఆయన పెద్ద కూతురు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానన్న సమయంలో జగపతిబాబు కుల పెద్దలు పెద్ద పేచీ పెట్టారట. అయితే జగపతిబాబు కమ్మ కులానికి చెందినవారు.ఆయన వీరమాచినేని వంశానికి చెందినవారట. దాంతో వీరమాచినేని వంశం అంటే గొప్ప వాళ్ళని ఆ వంశంలో ఉన్న ఆడవాళ్లు,మగవాళ్ళు ఇతర కులస్తులను పెళ్లి చేసుకోకూడదు అనే రూల్ పాటిస్తారట.కానీ జగపతిబాబు కూతురు అమెరికాకు చెందిన ఓ అబ్బాయిని వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో జగపతిబాబు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారట. కానీ వాళ్ళ కులం వాళ్ళు మాత్రం మీ అమ్మాయి వేరే కులపోడిని పెళ్లి చేసుకుంటే ఊరుకునేదే లేదని, మీ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తామంటూ బెదిరించారట.

కానీ ఈ విషయంలో జగపతిబాబు మీరు ఇలా చేస్తే జీవితాంతం నా అల్లుడి కోసం కేసు నుండి బయటకు తీసుకురావడం కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అని చెప్పారట. అంతేకాదు ఇలాంటి వాళ్లు ఇంకా ఎందుకు ఉంటారో నాకు అర్థం కాదు.. ఇంకా కులం మతం అని మాట్లాడడమేంటో అంటూ జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు.అయితే చాలామంది కులం మతం అంటూ ఇప్పటికి కొట్టుకుంటున్నారు. ఒక మతం లేదా కులం అమ్మాయి లేదా అబ్బాయి వేరే కులం అబ్బాయిని లేదా అమ్మాయిని ప్రేమిస్తే కుల చిచ్చు ఏ విధంగా రాజుకుంటుందో చెప్పనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: