సినిమా ఇండస్ట్రీకి నేడు బ్లాక్ డే. మల్టీ టాలెంటెడ్ యాక్టర్  ఖొత శ్రినివస ఋఅఒ మరణించారు. ఎన్నో సినిమాలలో తనదైన స్టైల్ లో నటించి తనదైన స్టైల్ లో జనాలను మెప్పించి కడుపుబ్బ నవ్వించి .. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు గారికి 83 సంవత్సరాల . గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య కారణంగా బాధపడిపోతున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు .

సోషల్ మీడియాలో ఆయన సినీ ప్రస్థానం కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయ్. కోట శ్రీనివాసరావు తెలుగులోనే కాదు మలయాళం - కన్నడ - హిందీ - తమిళం .. ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు . అన్ని భాషల్లో కూడా సక్సెస్ అయ్యారు. కాగా కోటా శ్రీనివాసరావు జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు . ఆయన అసలు ఎక్కడ పుట్టాడు..? ఎలా ఇండస్ట్రీలోకి వచ్చాడు..? ఆయన తండ్రి ఏం చేస్తూ ఉండేవాడు ..? ఆయనకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సినిమాలలో ఎలా అవకాశం దక్కించుకున్నాడు..? అనేటివి. చాలా తక్కువ మందికే తెలుసు . కోటా శ్రీనివాసరావు ది విజయవాడలోని కంకిపాడు . తండ్రి వృత్తిరిత్య డాక్టర్ . ఇక కోట శ్రీనివాసరావును కూడా డాక్టర్ నే  చేయాలని చాలా ఎక్కువగా కష్టపడ్డారట . అలా ఇష్టం లేకుండానే డిగ్రీ వరకు చదివి ఆపేసాడట.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు.  ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరొక పక్క  నటన ఉన్న ఇంట్రెస్ట్ తో నాటకాలు చేసేవారట . అలా అలా నాటకాలు వేసుకుంటూ సినిమాలలో అవకాశాలు సంపాదించుకున్నారు. సినిమాలోకి వచ్చాక కూడా అవకాశాల కోసం బాగా కష్టపడ్డాడు . ప్రతిఘటన సినిమాతో ఆయన లైఫ్ ట్రన్ చేసుకున్నారు.  ఇక తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. సినిమాలలో వరుసగా ఛాన్స్ రావడం ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా సినిమాల పైన కాన్సన్ట్రేషన్ చేయడం ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేశాడు . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థాయి ఇంకా ఇంకా పెరిగిపోయింది . మంచి మంచి సినిమాలు చూస్  చేసుకొని ఆయన తన పేరుకి మంచి గౌరవాన్ని దక్కించుకున్నాడు . 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కోటా శ్రీనివాసరావు చివరిగా నటించిన సినిమా మాత్రం కబ్జా.  ఆయన వయసు పై పడటంతో ఎక్కువగా సినిమాలలో కనిపించడానికి ఇష్టపడలేదు . ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు లేని లోటు ఎవరు తీర్చలేనిది అంటూ పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: