తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో కోటా శ్రీనివాసరావు ఒకరు. ఈయన నటుడిగా చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో సంవత్సరాలు అద్భుతమైన రీతిలో కెరీర్ను ముందుకు సాగించాడు. ఇకపోతే కోటా శ్రీనివాసరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10 వ తేదీన కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. కోటా శ్రీనివాసరావు   దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750 కి పైగా సినిమాల్లో నటించారు. కోటా శ్రీనివాసరావు తెలుగు తో పాటు అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించారు. 1942  జులై 10 న కంకిపాడు లో కోట శ్రీనివాసరావు జన్మించారు.

ఆయనకు బాల్యం నుండి నాటకాలు అంటే ఎంతో ఆసక్తి. కోట శ్రీనివాస రావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో మంచి పేరొందిన డాక్టర్. దీంతో తండ్రి లాగే కోటా శ్రీనివాసరావు కూడా డాక్టర్ కావాలని అనుకున్నారట. సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పని చేసేవాడు. బ్యాంకులో పని చేస్తూనే తరచూ నాటకాలు కూడా వేస్తూ ఉండేవారట. ఆయనకు ఎన్ని నాటకాలు వేస్తున్న కూడా సినిమాల్లోకి రావాలి అని ఆసక్తి మాత్రం రాలేదట. 1977 వ సంవత్సరం కోటా శ్రీనివాసరావు మరియు అతని స్నేహితులు కలిసి ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శించారట.

ఈ నాటకాన్ని దర్శకుడు క్రాంతి కుమార్ చూశాడట. ఆ నాటకం క్రాంతి కుమార్ కి బాగా నచ్చడంతో ఆ కథతోనే ప్రాణం ఖరీదు అనే టైటిల్తో ఆయన సినిమాను రూపొందించాలి అనుకున్నాడట. ఇక నాటకంలో నటించిన వారిలో చాలా మందిని ఆ సినిమాలో నటీనటులుగా ఎంచుకున్నారట. అలా కోట శ్రీనివాసరావు కూడా ప్రాణం ఖరీదు సినిమాలో నటించారట. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: