
ఆ పాత్రను అంత బాగా డైరెక్ట్ జంధ్యాల తెరకెక్కిస్తే దానికి ప్రాణం పోసి నటించాడు కోట శ్రీనివాసరావు . అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం తో పిసినారి లక్ష్మీపతి పాత్రని కోట నటించిన ఆ సీన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి . కోటా శ్రీనివాసరావు సినీ హిస్టరీలోనే ఈ పాత్ర చాలా చాలా స్పెషల్ . లక్ష్మీపతి పాత్ర కోట శ్రీనివాసరావు కోసమే రాసారు అన్నేంతల ఒదిగిపోయారు . నిజానికి ఈ పాత్రలో ముందుగా కోట శ్రీనివాసరావును అనుకోలేదట డైరెక్టర్ జంధ్యాల కావాలని మొండి పట్టుదలతో నిర్మాత రామానాయుడుని కాంప్రమైజ్ చేయించి నిర్ణయం మార్చుకునేలా చేశారట .
అప్పటికే సక్సెస్ఫుల్గా కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న "రావు గోపాలరావు" గారిని పెట్టి ఆ లక్ష్మీపతి క్యారెక్టర్ తెరకెక్కించాలి అనుకున్నారట. అయితే అప్పటికే కోటా శ్రీనివాసరావు నటించిన మండలాధీసుడు సినిమాను చూసిన జంధ్యాల లక్ష్మీపతి పాత్రకు కోట అయితే చాలా బాగుంటాడు అని అలా ఆ పిసినారి పాత్రను ఆయన చేస్తే ఇంకా బాగా హైలైట్ అవుతుంది అంటూ చాలా కష్టపడి మేకర్స్ తో మాట్లాడి కాంప్రమైజ్ చేసి మరి ఈ రోల్ ని కోట శ్రీనివాసరావుకి ఇచ్చారట. ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు బయటపెట్టారు.
"చెన్నై వెళ్లేందుకు బయలుదేరి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న మూమెంట్లో నాకంటే ముందు అక్కడికి చేరుకున్నాడు రామానాయుడు . అప్పట్లో నాలాంటి నటుడు ఆయనకు దూరంగా కూర్చొని మాట్లాడమే పెద్ద విశేషం. అలాంటిది నన్ను చూడగానే ఆయన ఇక్కడికి రావయ్య అంటూ పిలవడం నీతో ఒక నిమిషం మాట్లాడాలి అంటూ అనడం నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది. ఆయన దగ్గరికి వెళ్లి ఏంటి సార్ విషయం ఏంటి అని అడిగే టైం లో జంధ్యాల మీతో ఒక సినిమా ప్లాన్ చేశారు ఫైనలైజ్ కూడా అయిపోయింది ..ఈ స్క్రిప్ట్ లో మీకు ఒక క్యారెక్టర్ ఉంది . మీకు ఓకేనా అంటూ అడిగారట . సక్సెస్ అయితే మీ సినిమా కెరియర్ టర్న్ అవుతుంది ..ఆ పాత్ర గురించి జంధ్యాల 20 రోజులుగా నాతో చర్చిస్తున్నాడు. రావుగోపాల్ రావు చేద్దాం అనుకున్నాం.. కానీ ఆయన నీ పేరు సజెస్ట్ చేశారు అంటూ పట్టు బట్టి ఆయన ఒప్పించారు. నా డేట్స్ కావాలి అంటూ 20 రోజులు అడిగారు వెంటనే తప్పకుండా ఇస్తాను సార్ అనేసాను.. ఆ తర్వాత ఆ పాత్రకి సెలెక్ట్ అవ్వడం ఆ పాత్ర జనాలను బాగా నవ్వించడం ..నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. ఆ పాత్ర నాకు ఎంతో మంచి పేరు తెచ్చింది " అనే సంగతులు గుర్తు చేసుకున్నారు కోటా శ్రీనివాస రావు..!!