
ఎస్ చింతకాయల రవి అనే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ పాత్రలో కనిపించాడు . ఈ సినిమాలో నటించిన ఒక్క రూపాయ్ కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు . వెంకటేష్ మీద ఉన్న అభిమానం ఫ్రెండ్షిప్ కొద్ది ఫ్రీగా చేసి పెట్టారు. "షాబషాబ" అనే సాంగ్ లో ఒక్క రెండు నిమిషాల పాటు అలా మెరిసి ఇలా మాయమవుతాడు. జూనియర్ ఎన్టీఆర్ మెరిసింది కేవలం రెండు అంటే రెండు నిమిషాలే . అయినా కూడా ఆయన అపీరియన్స్ హైలెట్గా మారింది. చింతకాయల రవి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అనుష్క - మమతా మోహన్ దాస్..ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు . వెంకటేష్ కెరియర్ లో ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . ఆయన నటించిన వార్ 2 సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది . ఆ తర్వాత దేవర 2 ని సెట్స్ పై కి తీసుకోరాబోతున్నాడు . ప్రజెంట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట జూనియర్ ఎన్టీఆర్. భారీ భారీ మాస్ డైలాగ్ లు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయట. "ఆది" సినిమా తర్వాత అలాంటి ఒక ఫుల్ లెంత్ మాస్ క్యారెక్టర్ లో హైలెట్ డైలాగ్స్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓ టాక్ బయటకి వచ్చింది. చూడాలి మరి తారక్ తన నెక్స్ట్ సినిమా లని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అనేది...??