ఎట్టకేలకు సక్సెస్ ఫుల్ గా పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది . మొదటి షో నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వినిపిస్తున్నాయి . పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ కి మరింత పాజిటివ్ కామెంట్స్ దక్కాయి . పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో బిజీ బిజీ గా ఉన్నాడు . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే బ్రో సినిమా తర్వాత సినీ తెర పై కనిపించిందే లేదు. చాలా టైం గ్యాప్ వచ్చింది . అయినా సరే పవన్ కళ్యాణ్ లోని యాక్టింగ్ స్టైల్ ఎక్కడ ఇంచు కూడా తగ్గలేదు . చాలా చాలా పర్ఫెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించాడు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు .


అంతేకాదు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్ కూడా హైలెట్ గా మారాయి . పవన్ కళ్యాణ్ ఎంత బాగా నటించినా సినిమాని ప్రమోట్ చేసుకోకపోతే సినిమా జనాల్లోకి వెళ్ళదు . జనాల్లోకి వెళ్ళలేని సినిమా ఎంత బాగా తెరకెక్కించిన ఏం లాభం . అయితే పవన్ కళ్యాణ్ తనకు స్టార్ స్టేటస్ ఉంది అని తన ఫ్యాన్స్ ఎలాగైనా సినిమాను హిట్ చేస్తారు  అన్న ఆలోచన లేకుండా సినిమాకి మంచి ప్రమోషన్స్ చేసుకున్నారు . సినిమా జనాల్లోకి వెళ్ళింది .  అంతే కాదు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  మరి ముఖ్యంగా ఈ సినిమా దాదాపు ఐదు సంవత్సరాలకి పైగానే సెట్స్ పై ఉండింది .



అప్పుడు పెద్దగా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ లేవు . కేవలం రెండే రెండు రోజుల్లో సినిమా టాక్ ను మొత్తం మార్చేసేలా చేశాడు పవన్ కళ్యాణ్ . కరెక్ట్ గా 48 గంటల నుంచి సినిమాకి ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ . ఈ నలభై ఎనిమిది గంటల్లో పవన్ కళ్యాణ్ పడిన కష్టం మొత్తం థియేటర్స్ లో హరిహర వీరమల్లు సినిమా రిజల్ట్ ఏంటో చెప్పేస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో చాలామంది  స్టార్స్ నటించారు . కానీ అందరికంటే హైలెట్గా మారింది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే . సినిమా మొత్తానికి కూడా కర్త - కర్మ - క్రియ అన్ని తానై నడిపించి సింగల్ హ్యాండ్ తో ఈ సినిమాను హిట్ కొట్టాడు . ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలర్ ఎగరేసి ఇది మా పవన్ సినిమా అని చెప్పుకునే స్థాయిలోనే ఈ హరిహర వీరమల్లు సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: