
ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కేసుల్లో చాలామంది స్టార్స్ ఇరుక్కుకుంటున్నారు. రీసెంట్ గానే చెన్నై లో ఓ పెద్ద డ్రగ్ సప్లయర్స్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. మే 22న నుంగంబాక్కంలోని ఓ హోటల్లో రెండు గ్రూపుల మధ్య ఓ పెద్ద గొడవ జరిగింది. దీనికి సంబంధించి నుంగంబాక్కం పోలీసులు అన్నాడీఎంకే నేత ప్రసాద్, ఈసీఆర్ రాజా, అజయ్ వాండయార్, రౌడీ సునామీ సేతు సహా మొత్తం 9 మందిని అప్పుడు అరెస్టు చేశారు. ఈ గొడవకు కారణాలపై పోలీసులు లోతుగా ఆరా తీయగా అసల విషయం బయటపడ్డింది.
సేలంకు చెందిన ప్రదీప్ కుమార్ అలియాస్ బ్రిట్టో అధిక మొత్తంలో కొకైన్ కొనుగోలు చేసి నటుడు శ్రీకాంత్, శ్రీకృష్ణలకు సరఫరా చేసినట్టు ప్రసాద్ వెల్లడించాడు. ఆ తర్వాత ప్రదీప్ కుమార్ సహా ఆఫ్రికాకు చెందిన జాన్ ను జూన్ 17న అరెస్టు చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు హీరో శ్రీరామ్, శ్రీకృష్ణలను అరెస్టు చేయగా, ఆ తర్వాత వీరిద్దరు బెయిల్ పై విడుదలయ్యారు. ఇక ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది . అసలు ఈ డ్రగ్స్ ఇష్యూలో ఎవరున్నారు..? అని పోలీసులు అర తీయగా బడా బడా సౌండ్ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అంటూ తెలిసింది .
ఈ క్రమంలోనే హీరో శ్రీరామ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు ప్రదీప్ కుమార్ అన్న విషయం బయటపడింది. కాగా రీసెంట్గా ప్రదీప్ బయటపెట్టిన విషయం జనాల ఫూజులు ఎగిరిపోయేలా చేసింది. డ్రగ్స్ కేసులో నటీనటులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పలువురు నటులు ప్రదీప్ కుమార్ కి 50 లక్షల వరకు లంచం ఇవ్వగా వాటిని పోలీసులకు అందజేశారట. ఇదే విషయాని అందరి ముందు బయటపెట్టాడు . దీంతో ప్రత్యేక పోలీసు బృందం ప్రదీప్ కుమార్ ను నామమాత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు .
అంతే కాదు ఈ అంశంపై మరింత లోతుగా డిప్యూటీ కమిషనర్ విచారణ జరుపుతున్నారు . అదే సమయంలో లంచం తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సీఐ, ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు పంపించారు. ఇదే మూమెంట్ లో కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మాదకద్రవ్యాలు తీసుకుంటున్న లిస్టులో కోలీవుడ్ స్టార్ హీరో కూడా ఉన్నాడు అని ఆయన డబ్బులు ఇచ్చి ఈ కేసు నుంచి తప్పించుకొని మీడియాలో ఆయన పేరు రాకుండా దాంకుంటున్నాడు అని .. ఆయనకున్న పేరు పలుకుబడితో పెద్దమనుషుల అండతో ఈ విషయంలో ఆయన పేరు బయటికి రాకుండా మ్యానేజ్ చేస్తున్నాడు అని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఆయన పేరు బయటికి రాకుండా ఉండాలి అంటూ లంచం కూడా ఇచ్చారట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!