టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు  . ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ద్వారా ఏ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడో ఆయన వ్యక్తిత్వం ద్వారా కూడా అదే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఇకపోతే తారక్ ఎంత గొప్ప వాడు అనే విషయాన్ని తాజా గా సీనియర్ నటి సుధ చెప్పుకొచ్చింది. సీనియర్ నటి సుధ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తారక్ ఎలాంటి వాడు ,  స్టేట్లో ఉన్న వారిని ఎలా చూసుకుంటాడు అనే విషయాల గురించి సుధా తాజా ఇంటర్వ్యూలో భాగంగా క్లుప్తంగా చెప్పుకొచ్చింది. 

తాజా ఇంటర్వ్యూలో భాగంగా సీనియర్ నటి సుధా మాట్లాడుతూ. ... తారక్ చాలా గొప్పవాడు. ఎంతో గొప్ప స్టార్ హీరో అయినా కూడా ఎప్పుడూ ఆయన గొప్పగా ఫీల్ కాడు. అందరితో కలిసిపోతూ ఉంటాడు. ఇక నేను తారక్ తో కలిసి బాద్ షా సినిమాలో నటించాను. ఆ సినిమా సమయంలో ఓ సంఘటన జరిగింది. ఆ సినిమాలో భాగంగా తారక్ చాలామంది లేడీస్ తో కలిసి డాన్స్ చేయవలసి ఉంటుంది. అందులో నేను కూడా ఉన్నాను.

అలా డాన్స్ చేస్తున్న సమయంలో నేను కాలు స్లిప్ పై కింద పడిపోయాను. దానితో నా కాలు బెణికింది. బాగా నొప్పి వచ్చింది. దానితో వెంటనే తారక్ అక్కడ ఉన్న వారిని పిలిపించి స్ప్రే తెప్పించి మరి ఆయనే నాకు కాలు పట్టి దానిని నా కాలుకు స్ప్రే చేశాడు. ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్పాడు. అంత గొప్ప స్టార్ హీరో అయి ఉండి కూడా నా కాళ్లు పట్టుకొని స్ప్రే కొట్టడంతో నా కాళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని సుధా తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: