
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అసలు నాన్-థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టమైపోయింది. కానీ ఈ సినిమాను హాట్ స్టార్ కు చెందిన మూడు టీమ్స్ చూసి మరీ కంటెంట్ బాగా నచ్చడంతో మంచి రేటుకు తీసుకున్నారట. కంటెంట్ మీద నమ్మకంతో సుందరాకాండ టీం హాట్ స్టార్ ను సంప్రదించి సినిమాను చూపించి మరీ డీల్ క్లోజ్ చేయడం గమనార్హం. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించడం అంటే, సుందరకాండ కథ, కంటెంట్ లో ఏదో అద్భుతం ఉందని స్పష్టమవుతోంది. బలమైన కంటెంట్ ఉంటే ఓటీటీ సంస్థలు భారీగా వెచ్చించి కొనుగోలు చేస్తాయని నిరూపించింది ఈ సుందరాకాండ. ఇక సుందరకాండ ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
నారా రోహిత్ కు 20వ చిత్రం కాగా, ఈ సినిమా ద్వారా వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ తో పాటు వృతి వాఘాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా. సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ బహుసా బహుసా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే టీజర్ కి ట్రెమాండస్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా నారా రోహిత్ కు కంబ్యాక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు