మరో రెండు రోజుల్లో కింగ్డమ్ మూవీ విడుదల కాబోతోంది. అయితే ఒక సినిమా విడుదలవుతుంది అంటే ఆ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా కొత్త సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో ఎవరైనా కొత్త ఆర్టిస్టులు ఉన్నారా అనేది జనాలు ఎక్కువగా వెతుకుతూ ఉంటారు.ఆ కొత్త సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఆ సినిమాలో ఉండే కొత్తవారు కూడా కనిపిస్తారు. దాంతో ఈ సినిమాలో నటించే ఆ నటీనటులు ఎవరు.? వారి బ్యాగ్రౌండ్ ఏంటి.?అని తెలుసుకునే పనిలో పడతారు నెటిజన్స్..అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న కింగ్డమ్ మూవీలో కూడా ఒక కొత్త ఫేస్ కనిపించింది.. మరి ఇంతకీ కింగ్డమ్ మూవీలో కనిపించిన ఆ కొత్త విలన్ ఎవరు.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కింగ్డమ్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది.జూలై 31న విడుదల కాబోతున్న కింగ్డమ్ మూవీకి సంబంధించి తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్ వేడుకను తిరుపతిలో ఘనంగా చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ విడుదలైన కింగ్డమ్ మూవీ ట్రైలర్ లో ఒక కొత్త ఫేస్ కనిపించింది. ఆయనే నటుడు వెంకటేష్ వీపీ.అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు.ఇక ట్రైలర్లో కనిపించిన ఈ నటుడును చూసి ఈ కొత్త విలన్ ఎవరు అంటూ నెటిజన్స్ ఆరా తీసారు. అయితే ఈయన అసలు పేరు వెంకటేష్ వీపి అని, మలయాళ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు..

మలయాళ ఇండస్ట్రీలో 2014 నుండి యాక్టివ్ గా ఉంటున్నారు. అలా వెంకటేష్ మలయాళ సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా యాక్టింగ్ చేశారు. అంతేకాకుండా నటుడు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్ నటించిన రెబల్ మూవీలో విలన్ పాత్ర పోషించారు.అలా తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీలో విలన్ పాత్రలో నటించే అవకాశం అందుకున్నారు.అయితే ట్రైలర్ లో ఈయన కనిపించింది రెండు షార్ట్స్ లోనే అయినప్పటికీ ఈయనకి సంబంధించిన ఆ షాట్స్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఇంతకీ ఈ కొత్త వీలన్ ఎవరు అని తెలుసుకునే పనిలో పడ్డారు.అయితే కింగ్డమ్ మూవీలో వెంకటేష్ యాక్టింగ్ బాగుంటే కనుక తెలుగు టాలీవుడ్ సినిమాలకు మరో కొత్త విలన్ దొరికినట్టే.. ఇప్పటికే చాలామంది ఇతర ఇండస్ట్రీలో హీరోలు టాలీవుడ్ లో విలన్ లుగా రాణిస్తున్నారు.ఇప్పుడు కింగ్డమ్ మూవీతో వెంకటేష్ కూడా గుర్తింపు తెచ్చుకుంటే టాలీవుడ్ కి మరో యంగ్ విలన్ దొరికినట్టే అంటున్నారు ఇది చూసిన నెటిజన్లు. ఇక కింగ్డమ్ మూవీ అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది


మరింత సమాచారం తెలుసుకోండి: