టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. మిస్టర్ బచ్చన్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను దక్కించుకున్న భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఏ ప్రీమియర్స్ మాత్రం జూలై 30 వ తేదీ నుండి ప్రదర్శితం కానున్నాయి. ఈ మూవీ యూ ఎస్ ఏ ప్రీమియర్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీ యూ ఎస్ ఏ ప్రీమియర్స్ కి జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఇప్పటివరకు ఈ సినిమా యూ ఎస్ ఏ ప్రీమియర్స్ కి ప్రీ సేల్స్ 200 కే జరిగినట్టు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు , ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధిస్తే ఆ వెంటనే ఈ సినిమా రెండవ భాగాన్ని కూడా మొదలు పెట్టనున్నట్లు కొంత కాలం క్రితం ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ప్రకటించాడు. మరి ఈ మూవీ మొదటి భాగం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd