పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా తాజాగా థియేటర్లలో విడుదల ఆయన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా చాలా కాలం తర్వాత విడుదల కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల కానుంది.

మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే పవన్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల , రాశి కన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ గురించి ప్రముఖ నిర్మాత అయినటువంటి SKN తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

ఆ పోస్ట్ ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతుంది. తాజాగా ప్రముఖ నిర్మాత SKN తన సోషల్ మీడియా వేదికగా ... కళ్ళ నిండా లైవ్ లో ఆయన డాన్స్ చూస్తే కడుపు నిండిన భావోద్వేగం. లిరిక్ బయటకి వచ్చిన రోజున సోషల్ మీడియా మొత్తం. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకొందాం. అని ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ నిర్మాత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదల తేదీ ప్రకటన కోసం కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

skn