సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను దర్శక నిర్మాతలు, హీరోలు వేధించడం అనేది కామన్ గా వినిపిస్తున్న విషయమే. అయితే ఈ విషయం గురించి ఈ మధ్యకాలంలో చాలామంది నటీమణులు బయటికి వచ్చి పేర్లతో సహా బయట పెడుతున్నారు. కొంతమంది మాత్రం పేర్లు తీయకుండానే బయటపెడుతున్నారు. అయితే తాజాగా ఓ నటి నిర్మాత పై చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. అవి సెక్సీగా ఉన్నాయి ఒకసారి ముద్దు పెట్టుకుంటా అంటూ ఆ నిర్మాత అసభ్యంగా మాట్లాడిన మాటలను తాజాగా ఈ నటి బయటపెట్టింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ నటి జెన్నీఫర్ మిస్త్రీ.. తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా తో పాపులర్ అయినటువంటి జెన్నిఫర్ తాజా ఇంటర్వ్యూలో నిర్మాత ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

 జెన్నీఫర్ మాట్లాడుతూ.. నేను తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా లో సోధి పాత్రలో నటించాను. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు నిర్మాత నాతో అసభ్యంగా ప్రవర్తించారు.. నాకు 2018లో షో ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణితో గొడవ జరిగింది.అయితే ఈ గొడవ గురించి ప్రొడ్యూసర్ ఆసిత్  కుమార్ మోదికి చెబుతామని వెళ్తే ఆయన నాతో అసభ్యంగా. ప్రవర్తించారు. నా గొడవ గురించి నేను చెబుతూ ఉంటే ఆయన మాత్రం నా మాటలు పట్టించుకోకుండా నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అంటూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడారు. ఇక 2019లో విదేశాలకు షూటింగ్ కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ అసిత్ కుమార్ మోదీ తన గదిలోకి వచ్చి డ్రింక్ చేయమని కోరాడు.
కానీ నేను ఆయనని పక్కన పెట్టాను. ఇక నేను రిజెక్ట్ చేయడంతో ఆయన మోనిక భడోరియా దగ్గరికి వెళ్లి కూడా అలాగే మాట్లాడారు. ఇక తర్వాత రోజు ఉదయం కాఫీ తాగుతుండగా నిర్మాత వచ్చి అందరం ఉండగానే నా పెదాలను చూస్తూ నీ లిప్స్ చాలా అందంగా సెక్సీగా ఉన్నాయి.వాటిపై ఒక ముద్దు పెట్టుకోనా అంటూ మాట్లాడారు. అయితే ఆ నిర్మాత మాటల్ని నేను పట్టించుకోకపోయినప్పటికీ ఆయన ప్రతిసారి నన్ను లైంగికంగా వేధించిన విషయం మాత్రం నామీద ప్రభావం చూపాయి. ఆయన వల్ల నేను మానసిక వేదన అనుభవించాను. అంటూ జెనీఫర్ మిస్త్రీ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఛానల్ లో ఈ విషయం బయట పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: