అత్యంత భారీ అంచనాల నడుమ ఓకే రోజు విడుదల కావడానికి రెడీగా ఉన్న సినిమాలు వార్ 2 , కూలీ. ఈ రెండు సినిమాలలో కూడా స్టార్ హీరోలు నటించడంతో ఈ మూవీలపై అద్భుతమైన అంచనాలు ప్రేక్షకుల్లో నిలకొని ఉన్నాయి. వార్ 2 మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. అలాగే ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కూడా నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇక కూలీ సినిమా విషయానికి వస్తే ఈ మూవీ లో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జునమూవీ లో విలన్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. శృతి హాసన్ , ఉపేంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని కూడా ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఏ మూవీ ఎక్కువ ఇంపాక్ట్ ను ఎక్కువగా చూపిస్తుంది అనే దానిపై ప్రేక్షకుల్లో కూడా ఆత్రుత చాలా పెరిగిపోయింది.

ఇకపోతే బుక్ మై షో ఆప్ లో మాత్రం కూలీ సినిమాను భారీ మార్జిన్ తో వార్ 2 మూవీ దాటేసింది. అసలు విషయం లోకి వెళితే ... కూలీ సినిమాకి బుక్ మై షో ఆప్ లో 2 లక్షల మేర ఇంట్రెస్ట్ లు దక్కగా , వార్ 2 మూవీ కి మాత్రం మూడున్నర లక్షలకి పైగా ఇంట్రెస్ట్ లు దక్కాయి. దీనితో బుక్ మై షో ఆప్ లో  క్లియర్ గా వార్ 2 డామినేషన్ కనిపిస్తుంది. ఇలా బుక్ మై షో ఆప్ లో కూలీ మూవీ ని భారీ మార్జిన్ తో వార్ 2 మూవీ దాటేసింది. మరి సినిమా విడుదల అయ్యాక ఏ మూవీ ఎలాంటి టాక్ ని తెచ్చుకొని ఈ రెండు మూవీలలో ఏ మూవీ మంచి స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: