
బాలయ్య ట్రిపుల్ రోల్ – మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ..ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రలు చేయబోతున్నారని టాక్. ఒకటి ప్రస్తుత కాలానికి, మరొకటి భవిష్యత్‌కు, ఇంకొకటి ప్రాచీన కాలానికి చెందిన పాత్రలుగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇందులో సస్పెన్స్ కూడా పుష్కలంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు – తనయుడు మోక్షజ్ఞకి గ్రాండ్ లాంచ్ ప్లాట్‌ఫామ్ కూడా ఇదే కావడం ప్రత్యేకత. మోక్షజ్ఞ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారు. అది పూర్తి హీరో రోల్ కాకపోయినా – పవర్‌ఫుల్ పాత్ర అని అంటున్నారు. బాలయ్య కూడా ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తారు బాలయ్య, ఆ తర్వాత వెంటనే ‘ఆదిత్య 999’ సెట్స్ పైకి వెళ్లనుంది.
టెక్నికల్‌గా గ్రాండ్ – కథలో కొత్త లోకాలు .. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యూచరిస్టిక్ సెట్స్, శాస్త్రీయ నేపథ్యం అన్నీ మాస్‌కి దగ్గరగా ఉంటూనే ఇంటలిజెంట్‌గా మలచబోతున్నట్టు సమాచారం. కథలో కొత్త టైమ్ జోన్లతో పాటు, ఇంకెంతదూరంగా మనిషి ప్రయాణించవచ్చో చూపించే స్థాయిలో ఆలోచనలు జరుగుతున్నాయి. ఇది తెలుగు ఇండస్ట్రీకి ‘ఇన్సెప్షన్’ స్టైల్ మూవీగా నిలుస్తుందా? అన్న ఉత్కంఠను కలిగిస్తోంది. ఫ్యాన్స్ కు డబుల్ ఫెస్టివల్! .. 2026 బాలయ్య బర్త్‌డే సందర్భంగా "ఆదిత్య 999" టైటిల్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇందులో బాలయ్య – మోక్షజ్ఞ తండ్రీ కొడుకులుగా కాకుండా ఇద్దరూ వేర్వేరు కాలాలలో కీలక పాత్రలు చేయబోతున్నారని టాక్. ఈ సినిమాతో నందమూరి అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ ఖాయం! బాలయ్య స్టైల్, మోక్షజ్ఞ స్టార్టింగ్, క్రిష్ విజన్ అన్నీ కలుస్తే ‘ఆదిత్య 999’ తెలుగు తెరపై మరోసారి చరిత్ర సృష్టించే అవకాశం పుష్కలంగా ఉంది!