
స్టోరీ విషయానికి వస్తే..
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కల్నాల్ విజయ్ మీనన్ విధులు నిర్వహిస్తూ ఉంటారు ఈయనకు దేశభక్తి అన్న దేవుడు అన్న.. చాలా ఎక్కువ.. ప్రాణం కంటే దేశమే ముఖ్యమని ఎంచుకునే రకం.. విజయ్ కి హర్మన్ అనే కుమారుడు ఉంటారు.. హర్మన్ ఎక్కువ భయస్తుడు. ఈ విషయంలోనే హర్మన్ కు తన తండ్రిపై ఎక్కువ ద్వేషం పెరుగుతుంది.. అలా ఒకసారి తీవ్రవాదుల ఘర్షణలో విజయ్ కుమారుడు హర్మన్ ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు.. తన కుమారుడిని విడుదల చేయాలి అంటే తమ అనుచరుడుని విడుదల చేయాలంటూ టెర్రరిస్టులు డిమాండ్ చేస్తారు.
కానీ వీటన్నిటిని పట్టించుకోకుండా విజయ్ బంధించిన టెర్రరిస్టుల పైన కాల్పులు చేస్తారు. ఆ తర్వాత విజయ్, తన భార్య ఇద్దరు కూడా తన కుమారుడు చనిపోయాడని భావిస్తారు.. కానీ తన తండ్రి పైన ఉన్న ద్వేషాన్ని హర్మన్ కు మరింత ఎక్కించి ఆయుధంగా ఉపయోగించి తీవ్రవాదిగా తయారు చేస్తారు. తిరిగి మళ్లీ విజయ్ దగ్గరికి పంపగా విజయ్ అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా? లేదా అన్నది సినిమా కథ. ఈ సినిమా హట్ స్టార్ లో స్ట్రీమ్మింగ్ అవుతోంది. ఆఖరిలో వచ్చే ట్విస్టులు, థ్రిల్లింగ్ సన్నివేశాలు హైలైట్ గా ఉన్నాయి.