టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ అనౌన్స్ అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దానితో ఒక్క సారిగా ఈ మూవీ పై హైప్ కూడా వచ్చింది. దానికి ప్రధాన కారణం చరణ్ ఈ మూవీ లో హీరో గా నటించడం , జెర్సీ లాంటి క్లాసిక్ మూవీ ని రూపొందించిన  గౌతమ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించనుండడంతో ఈ కాంబో మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ క్యాన్సిల్ అయింది. దానితో గౌతమ్ , విజయ్ దేవరకొండ హీరోగా మూవీ సెట్ చేసుకున్నాడు. తాజాగా విజయ్ , గౌతమ్ కాంబోలో రూపొందిన కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. చరణ్ సినిమా క్యాన్సల్ అయిన తర్వాత విజయ్ తో గౌతమ్ మూవీ ఓకే చేసుకోవడంతో చరణ్ రిజెక్ట్ చేసిన కథతోనే గౌతమ్ , విజయ్ తో మూవీ ని రూపొందించాడు అనే వార్తలు అనేకం వైరల్ అయ్యాయి.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ వంశీ ఇందుకు సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ ... గౌతమ్ , చరణ్ గారికి చెప్పిన స్టోరీ వేరు. విజయ్ తో మేము రూపొందించిన కింగ్డమ్ స్టోరీ వేరు. గౌతమ్ , చరణ్ కు చెప్పిన స్టోరీ పక్కన పెట్టి ఈ స్టోరీని రాసుకున్నాడు. దానినే మేము కింగ్డమ్ మూవీ గా రూపొందించాం అని నాగ వంశీ చెప్పుకొచ్చాడు. దీనితో చరణ్ తో గౌతమ్ అనుకున్న సినిమా వేరు విజయ్ తో రూపొందించిన కింగ్డమ్ కథ వేరు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: