లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం భారతీయుడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ్ భాషలో రూపొందిన ఈ సినిమాని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా హీరో గా కమల్ హాసన్ కు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. అలాగే దర్శకుడిగా శంకర్ కి కూడా ఈ సినిమా అద్భుతమైన ఈమేజ్ ను తీసుకువచ్చింది. కమల్ హాసన్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగా మరొక పాత్రలో కొడుకుగా నటించాడు.

ఈ రెండు పాత్రల్లో కూడా తనదైన రీతిలో వైవిధ్యాన్ని చూపించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. శంకర్ మొదట ఈ సినిమాలో హీరో గా కమల్ హాసన్ ను అనుకోలేదట. మన తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఇద్దరు నటులను హీరోలుగా అనుకున్నారట. కానీ అది కుదరకపోవడంతో కమల్ హాసన్ ను హీరోగా తీసుకున్నాడట. మరి మొదట మన తెలుగు హీరోలను అనుకున్న కథలోకి కమల్ హాసన్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు అనే వివరాలను తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో తండ్రి కొడుకుల పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉండటంతో ఈ సినిమాలో ఇద్దరు తెలుగు హీరోలను తీసుకోవాలి అని మొదట శంకర్ అనుకున్నాడట.

అందులో భాగంగా రాజశేఖర్ , వెంకటేష్ హీరోలుగా భారతీయుడు మూవీ ని రూపొందించాలి అని శంకర్ మొదట అనుకున్నాడట. అందులో భాగంగా రాజశేఖర్ తో తండ్రి పాత్రను వెంకటేష్ తో కొడుకు పాత్రను వేయించాలి అని ఆయన అనుకున్నారట. కానీ అది కుదరకపోవడంతో శంకర్ , కమల్ హాసన్ తో ఈ మూవీ ని రూపొందించినట్లు తెలుస్తోంది. భారతీయుడు సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా కమల్ హాసన్ హీరోcగా శంకర్ "భారతీయుడు 2" అనే మూవీ ని రూపొందించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: