పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ హీరో . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం ఒకపక్క రాజకీయాలను మరొక పక్క సినిమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాడు . పవన్ కళ్యాణ్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు . ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే . అయితే పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తి అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చాడు హీరో వెంకట్.  హీరో వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . గతంలో ఎన్నెన్నో మంచి సినిమాలలో నటించాడు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు .


ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న "ఓజి" సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక చిన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయట పెట్టాడు వెంకట్ . "ఇందులో ఒక సీన్ ఉంటుంది.  నేను ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ గారి కాలర్ పట్టుకొని ఒక డైలాగ్ చెప్పాలి ..బెదిరించాల్సి ఉంటుంది . ఆ సీన్ చేయమని డైరెక్టర్ నాకు చెప్పగానే షివరింగ్ వచ్చేసింది . ఆయన ఒక పెద్ద పవర్ స్టార్ .. పైగా ఏపీ డిప్యూటీ సీఎం . నేను ఆయన కాలర్ పట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..?"అంటూ భయమేసింది .



ఇదే విషయాన్ని మళ్ళీ డైరెక్టర్ కి చెప్పాను . మీరేమో నన్ను కాలర్ పట్టుకోమంటున్నారు.  ఇది ఎలా ..? ఫ్యాన్స్ నన్ను ఇబ్బంది పెడతారేమో ..? నాకు భయంగా ఉంది అంటూ చెప్పారట.  డైరెక్టర్ సుజిత్ మాత్రం నేను అస్సలు ఈ సీన్స్ మార్చను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ..మీరే సార్ తో మాట్లాడుకోండి అంటూ క్లియర్ గా చెప్పేసారట . దీంతో చేసేది ఏమీ లేక భయంతోనే వెంకట్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి "అన్నయ్య నేను మీకు కాలర్ పట్టుకోవాలి ఒక సీన్ లో" అంటూ భయంగానే తడబడుతూ చెప్పారట . దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ "దాంతో ఏముంది పట్టుకోండి సినిమానే కదా ..?" అంటూ చాలా నవ్వుతూ క్యాజువల్ గా చెప్పారట . ఒక్కసారిగా అప్పటివరకు ఆయన పడిన భయం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందట . ఆ సీన్ చాలా చాలా బాగా తెరకెక్కిందట . ఫ్రెండ్లీగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం ఇంకా హైలైట్ గా మారింది అంటూ చెప్పుకు వచ్చారు వెంకట్ . పవన్ కళ్యాణ్ ఎంత మంచివాడు అని చెప్పడానికి ఇది మరొక బిగ్ ఎగ్జాంపుల్ . ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాతో మరొక క్లియర్ ఎంటర్టైన్మెంట్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: