
కాగా భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది . విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలుస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ఆయనకు జంటగా నటించింది . వీళ్లిద్దరి కాంబో బాగా సెట్ అయింది అంటున్నారు అభిమానులు . ఈ సినిమా ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరియర్లో ఒక రికార్డ్ వసూలు అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఈజీగా 30 కోట్లకు పైగానే ఓపెనింగ్ గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .
కింగ్ దమ్ తో విజయ్ కొత్త నెంబర్ ని సెట్ చేయబోతున్నాడు అంటూ సినీ ప్రముఖులు భావిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని నిర్మించారు. రిలీజ్ అయిన ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . అడపాదడప నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న కానీ విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ అవి మొత్తం పాజిటివిటీగా మార్చేసుకున్నాడు . ఈ సినిమా విజయ్ దేవరకొండ సినీ చరిత్రలో గుర్తుండిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్. గీతగోవిందం తరువాత అలాంటి హిట్ అందుకున్నాడు విజయ్ అంటున్నారు..!