తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం రిస్కు తీసుకునే హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. నాని ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాల్లో నటించడం లేదు. కాస్త సేఫ్ జోన్ ఉన్న సినిమాల్లోనే నాని నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. మరో విషయంలో కూడా నాని సేఫ్ జోన్ లో వెళ్తున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? నాని ఈ మధ్య కాలంలో తనకు మంచి విజయాలు ఇచ్చిన దర్శకులతో పని చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. దానితో ప్రస్తుతం నాని హీరో గా శ్రీకాంత్ ఓదెలా "ది ప్యారడైజ్" అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

నాని కొంత కాలం క్రితం శౌర్యవ్ అనే దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన  హాయ్ నాన్న అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తనకు ఇప్పటికే హాయ్ నాన్న మూవీ తో మంచి విజయాన్ని అందించిన సౌర్యవ్ దర్శకత్వంలో మరో సినిమాలో నాని నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శౌర్యవ్ , నానికి ఓ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో మరోసారి శౌర్యవ్ దర్శకత్వంలో పని చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా నాని తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో సేఫ్ జోన్ లో తన జర్నీని కొనసాగిస్తున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: