ప్రకృతి అందాల మధ్య పండోరా, వింతలు విశేషాలు విడ్డూరాలతో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తూ తీసిన సినిమా అవతార్.. ఇలాంటి ఒక నిశ్శబ్ద గ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది మానవాళి.. అవతార్ లను నాశనం చేసి అక్కడ ఉండే ఖరీదైన యురేనియం గనులను తవ్వుకోవాలని ఆశ పడుతూ ఉంటారు.. ఇలా ఎంతో అద్భుతమైన టెక్నాలజీతో తెరకెక్కించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ 1, అవతార్ 2 సినిమాలు విడుదలై ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో చెప్పాల్సిన పనిలేదు.


ఈ రెండు చిత్రాలు 5 బిలియన్ డాలర్లు కొల్లగొట్టాయి. అయితే ఇప్పుడు అలాంటి ప్రాంఛైజీ నుంచి అవతార్ 3 రాబోతోంది. ఈ సినిమా కోసం చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు భాగాలకంటే మూడో భాగమే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. 2025 డిసెంబర్ 19న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే ఇంతలోనే అవతార్ 3 టార్గెట్ కలెక్షన్స్ ఎంతనే విషయంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.


అవతార్ ప్రాంచైజీ చిత్రాలు ఇండియా నుంచి రూ .100 కోట్లకే కాకుండా అంతకుమించి రాబడుతున్నాయి. 2009లో విడుదలైన అవతార్ 1వ  భాగం కలెక్షన్స్ రూ.13,500 కోట్ల రూపాయలు (2.9 బిలియన్ డాలర్లు ).. 2022లో వచ్చిన అవతార్ 2వ  భాగం కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.12,500 కోట్లు..(2.3 బిలియన్ డాలర్లు).. ఇప్పుడు విడుదల కాబోతున్న అవతార్ 3 కలెక్షన్స్ టార్గెట్ అంచనా ప్రస్తుత డాలర్ల విలువల ప్రకారం.. రూ.25,000 కోట్ల రూపాయలు..(అంటే సుమారుగా 3 బిలియన్ డాలర్లు) ఇంత రాబట్టగలదని డైరెక్టర్ కామెరూన్ చిత్ర బృందం భావిస్తోందట. అంతేకాకుండా అవతార్ 4 కూడా 2029లో అలాగే అవతార్ 5 కూడా 2031 టార్గెట్ గా చేసుకొని రిలీజ్ చేయబోతున్నారట. ఒక్కో సినిమా సరికొత్తగా ప్రజెంటేషన్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: