
వీటికి తోడు వీరిద్దరూ కలిసి దిగుతున్నటువంటి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో డేటింగ్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ విషయం పైన అటు సమంత కాని ఇటు రాజ్ కానీ ఎవరు చెప్పడం లేదు. అయితే తాజాగా ఒక రెస్టారెంట్లో సమంత ఫోటోలు దిగుతూ కొన్ని ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో సమంత చిల్ అవుతూ కనిపిస్తోంది. అలాంటి సమయంలోనే సమంత చేతికి ఒక స్పెషల్ రింగ్ కనిపించడంతో మరింత ఆశ్చర్యానికి గురిచేసింది అభిమానులను.
గతంలో ఎప్పుడూ కూడా సమంత చేతికి ఇలాంటి రింగ్ కనిపించలేదు.. ఇప్పుడు కనిపించడంతో పలువురు నెటిజెన్స్ పలు రకాల భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. అయితే సమంత ధరించిన ఈ రింగ్ ఆమె అదృష్టానికి ధరించిందా లేకపోతే రాజ్ గుర్తుగా ఇచ్చారా అన్న విషయాన్ని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు తెరకెక్కించినటువంటి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వంటివి సిరీస్లలో కూడా సమంత నటించిన స్నేహబంధం ఏర్పడి ఇప్పుడు ఈ స్నేహబంధం ఎక్కడిదాకా వెళుతుందనే విషయం చూడాలి మరి. కానీ ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కడికి వెళ్లినా కూడా ఇద్దరు ఒకే చోటే కనిపిస్తూ ఉన్నారు.