
ఈ ఏడాదిలో మన టాలీవుడ్ దగ్గర ప్రస్తుతానికి ఉన్న బిగ్గెస్ట్ క్లాష్ ఏదైనా ఉంది అంటే అది దసరాకు మాత్రమే అని చెప్పాలి. దసరాకు సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. నటసింహ నందమూరి బాలకృష్ణ కలయికలో చేస్తున్న సెన్సేషనల్ చిత్రాలు “ ఓజి ” అలాగే “ అఖండ 2 ” ల క్లాష్ అని చెప్పాలి. ఈ ఇద్దరు హీరోల కెరీర్ లో ఈ రెండు సినిమాలు భారీ హైప్ క్రియేట్ చేసుకున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయడంతో ఇప్పుడు అందరూ ఈ ఎపిక్ క్లాష్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రెండు సినిమాలకి ఇప్పుడు ఒకటే సమయం మిగిలి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ ఇప్పటికే క్లోజ్ అయ్యింది. అఖండ షూటింగ్ మాత్రం చివరి దశలో ఉంది. ఆల్రెడీ ఓజి ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ కూడా వచ్చేసింది. అంటే రిలీజ్ దగ్గరకి ముందు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మేకర్స్ వచ్చేస్తున్నారు.
అయితే అఖండ 2 మాత్రం ఇంకా ఫస్ట్ సింగిల్ లేదా ఇతర అప్‌డేట్స్ పరంగా వెనకే ఉందని చెప్పాలి. మరి బాలయ్య సినిమా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో ? ఎప్పుడు అప్‌డేట్స్ ఇవ్వడం మొదలు పెడతారో ? చూడాలి. ఇప్పుడు ఆగస్టు కూడా వచ్చేసింది. రెండు నెలల గ్యాప్ లో అఖండ 2 ప్రమోషన్లు .. అప్‌డేట్లు ఇవ్వడం ఎలా ప్లాన్ చేస్తారో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు