హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం కింగ్డమ్ సినిమా జులై 31న థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీగానే రాబట్టాయి. మొదటి రోజే రూ .39 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా రెండు రోజులకు రూ .53 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు తాజాగా మూడవ రోజు కలెక్షన్స్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. కింగ్డమ్ సినిమా మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.



సినిమా రూ .53 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ బిజినెస్ జరగగా .. అంటే రూ .110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే సక్సెస్ అయినట్టే. ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి ఇప్పట్లో ఏ సినిమాలో లేకపోవడం వల్ల విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాకి ఈజీగా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. మరి బ్రేక్ ఈవెన్ సాధించేకి విజయ్ దేవరకొండకు ఎన్ని రోజులు సమయం పడుతుందో చూడాలి మరి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.


కింగ్డమ్ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నది. సినిమా విడుదలైన తర్వాత కూడా ప్రమోషన్స్ ను చిత్ర బృందం మరింత వేగవంతంగా చేశారు.. విజయ్ దేవరకొండ కమిట్ అయిన చిత్రాలు పూర్తి అయిన తర్వాతే కింగ్డమ్ 2 ఉంటుందంటూ వెల్లడించారు.. అలాగే చివరిలో సేతు క్యారెక్టర్ కూడా ఒక స్టార్ హీరో చేయబోతున్నారని ఆ హీరోని చూసి అందరూ కూడా సర్ప్రైజ్ అవుతారంటూ నిర్మాత నాగవంశీ తెలిపారు. కింగ్డమ్ సినిమా మొదటి భాగంలో హీరోయిన్ కేవలం పరిచయం మాత్రమే చేశామని రెండో భాగంలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందంటూ తెలియజేశారు. అలాగే సెకండ్ పార్ట్ లో అసలైన వార్ హీరో, హీరోయిన్ మధ్య మొదలవుతుందంటూ నాగ వంశీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: