
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ కెరీర్‌లో హిట్లు.. సూపర్ హిట్లు.. ప్లాపులు ఉన్నాయి. మహేశ్ కెరీర్ ప్రారంభంలోనే రాజకుమారుడు, మురారి, ఒక్కడు
వంటి వరుస విజయాలతో మంచి స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా మహేష్ కెరీర్‌కి మైలురాయిగా నిలిచింది. అయితే, తరువాత సినిమాల కథల ఎంపికలో వచ్చిన తడబాటు వల్ల మహేశ్‌కి కొన్ని ప్లాపులు తప్పలేదు. పూరి జగన్నాథ్ పోకిరి సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత గుణశేఖర్‌తో చేసిన సైనికుడు డిజాస్టర్ అయ్యింది. 2007లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అథిది సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యింది. హిందీలో వివాహ్, మై హూ నా, ఇష్క్ విష్క్ వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమృతా రావు అందం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు.
అయితే, అథిది సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవడంతో అమృతా రావు కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు మళ్ళీ రాలేదు. ఒకవేళ ఆమె తెలుగులో బాగా ఆడే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించి ఉంటే, తప్పకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి హీరోయిన్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉండేది. ఆమె అందానికి తగ్గ పాత్రలు రాకపోవడం, మొదటి సినిమా డిజాస్టర్ అవడం వల్ల ఆమెకు దక్షిణాది పరిశ్రమలో స్థానం దక్కలేదు. మహేష్ బాబు లాంటి హీరో పక్కన నటించే అవకాశం రావడం హీరోయిన్లకు పెద్ద కల. ఆ ఛాన్స్ అమృతకు వచ్చినా లక్ కలిసి రాక సౌత్‌లో ఆమె కెరీర్ స్మాష్ అయ్యింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు