ఏదైనా పండుగ సందర్భంగా తెలుగులో చానల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి రాఖీ పండుగ స్పెషల్ కావడం చేత స్పెషల్ ప్రోగ్రామ్స్ తో సందడి చేస్తున్నారు. అలాంటి షోలకు తాజాగా నటుడు రాజీవ్ కనకాల రావడం జరిగింది. షో మొత్తం ఎంజాయ్ చేసిన చివరిలో ఐదు సంవత్సరాల క్రితం తన చెల్లిని చూపించడంతో ఒక్కసారిగా గుక్క పట్టి ఏడ్చారు రాజీవ్ కనకాల. ఆమెని గుర్తుచేసుకొని చాలా బాధపడుతూ మాట్లాడడం జరిగింది.


ఆదివారం ప్రసారం అవుతున్న ఒక షోకి రాజీవ్ కనకాల అతిథిగా వచ్చారు. ఈ షోలో రాఖీ నేర్పద్యంలో కొనసాగిన ఈ షోలో నూకరాజు, వర్ష అన్నా చెల్లెలుగా కనిపిస్తూ ఒక స్కిట్ చేయడం జరిగింది. చివరిలో చెల్లి పాత్రలో నటించిన వర్ష క్యాన్సర్ తో మరణించినట్లుగా చూపించారు. అయితే అక్కడున్న వారందరినీ కూడా చాలా కంటతడి పెట్టించినట్లు కనిపిస్తోంది. రాజీవ్ కనకాల కూడా చాలా ఎమోషనల్ గా కనిపించారు..


ఈ షో లోనే చనిపోయిన తన చెల్లి శ్రీలక్ష్మిని ఏఐ వీడియో రూపంలో చూపించారు.. ఈ వీడియోలో రాజీవ్ కనకాలకు ఆమె వచ్చి రాఖీ కట్టినట్లుగా శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా చూపించారు. ఇదంతా చూసిన రాజీవ్ కనకాల ఒక్కసారిగా ఏడ్చేశారు. రాజీవ్ కనకాల చెల్లి శ్రీలక్ష్మి 2020లో క్యాన్సర్ తో మరణించింది. అయితే అప్పటికి ఆమె వయసు 40 సంవత్సరాలు ఈమె కూడా కొన్ని సీరియల్స్లలో సినిమాలలో కూడా నటించింది.రాజశేఖర్ చరిత్ర అనే సీరియల్ ద్వారా పరిచయమైన శ్రీలక్ష్మి తన తండ్రి దేవదాసు కనకాల తీసిన పలుకు సీరియల్స్లలో కూడా నటించింది. అలాగే కన్నడ, హిందీ, తెలుగు వంటి సినిమాలలో కూడా నటించింది శ్రీలక్ష్మి. రాజీవ్ కనకాల చెల్లెలు మరణించక ఏడాది ముందే తండ్రి దేవదాస్ కనకాల మరణించారు.. రాజీవ్ కనకాల తల్లి 2018లో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: