అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మధ్య కాలంలో వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ ఏకంగా 50 శాతం సుంకాలు విధించడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దిగుమతులపై సైతం భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయాలే తీసుకోవాలని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. పార్లమెంట్ వెలుపల శశిథరూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా విధించిన సుంకాలు కచ్చితంగా మనపై ప్రభావం చుపిస్తాయని ఆయన అన్నారు.  దాదాపుగా  90 శాతం బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరుగుతాయని చెప్పుకొచ్చారు. సుంకం ఎక్కువగా ఉన్నప్పుడు మన దేశ వస్తువులు ఎందుకు కొనుగోలు చేయాలనీ ఆలోచిస్తారని ఆయన పేర్కొన్నారు.  రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువగా చైనా చమురును కొనుగోలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కానీ ఆ దేశానికి మాత్రం సుంకాల నుంచి ట్రంప్ మూడు నెలల పాటు ఉపశమనం కలిగించారని చెప్పుకొచ్చారు.  మనకు మాత్రం ట్రంప్ కేవలం మూడు వారాల పాటు మాత్రమే కల్పించడం సమంజసం కాదని ఆయన తెలిపారు. కేంద్రం కూడా యుఎస్ దిగుమతులపై 50  శాతం సుంకం విధిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. మరే  దేశం కూడా మనపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ఆయన తెలిపారు.

ట్రంప్ ఇప్పటికే విధించిన సుంకాలు  అమలులోకి రాగా కొత్తగా విధించిన సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని  సమాచారం అందుతోంది. ఈ ప్రభావం భారతీయ వస్త్ర పరిశ్రమతో పాటు ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది.  ఈ సుంకాలపై ప్రధాని మోడీ సైతం మాట్లాడారు.  రైతుల ప్రయోజనాల కోసం తాను  రాజీ  పడనని  ఆయన తెలిపారు.   రైతుల ప్రయోజనాలను కాపాడటం కొరకు వ్యక్తిగతంగా ఎంత చెల్లించడానికైనా సిద్ధమని అయన తెలిపారు. శశి థరూర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa