పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం ఓజి అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన కొంత కాలానికి ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఆ ఒక్క వీడియో ద్వారా ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ కొంత కాలం పాటు ఆగిపోయింది. మళ్లీ ఈ మూవీ షూటింగ్ lను ప్రారంభించిన మేకర్స్ అత్యంత వేగంగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ కి సంబంధించిన చాలా పనులను ఈ మూవీ బృందం వారు అత్యంత స్పీడుగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ మేకర్స్ అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ కి సంబంధించిన నైజాం మరియు ఉత్తరాంధ్ర థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు , ఒక ప్రముఖ సంస్థ ఈ సినిమా యొక్క నైజాం మరియు ఉత్తరాంధ్ర హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నైజాం మరియు ఉత్తరాంధ్ర థియేటర్ హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ వారు ఈ సినిమాను నైజాం మరియు ఉత్తరాంధ్రలో భారీ ఎత్తున విడుదల చేసే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk