కోర్టు మూవీ బ్యూటీ రహస్యంగా పెళ్లి చేసుకుందా..ఇదెక్కడి విడ్డూరం..ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో మెరిసి అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అని చాలామంది షాక్ అవుతూ ఉన్నారు. అంతేకాదు శ్రీదేవి పెళ్లికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ ఇవ్వకుండానే అలా ఎలా రహస్యంగా పెళ్లి చేసుకుంటుంది అని ఇంకొంత మంది షాక్ అవుతున్నారు.మరి నిజంగానే కోర్టు మూవీ బ్యూటీ శ్రీదేవి పెళ్లి చేసుకుందా..శ్రీదేవి పెళ్లి చేసుకుంది అనే వార్తల్లో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ లో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా చేసిన కోర్టు మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి కీ రోల్ పోషించగా..శ్రీదేవి,హర్ష్ రోషన్ లవర్స్ గా కనిపించారు. 

18 సంవత్సరాలు నిండని ఒక అమ్మాయిని ఇంటర్ ఫెయిల్ అయిన అబ్బాయి బలవంతంగా అత్యాచారం చేశాడంటూ ఒక తప్పుడు కేసు పెట్టి ఆయన్ని జైల్లో వేయించాలని కుట్రలు పన్నుతారు.కానీ అదే సమయంలో ప్రియదర్శి ఎంట్రీ ఇవ్వడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అయితే చట్టంలో ఉన్న చాలా సెక్షన్లు చాలామందికి తెలియదు.కానీ చట్టంలో లోని కొన్ని సెక్షన్ లపై ప్రజలకి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని పట్టి దర్శకుడు కోర్టు మూవీ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో హర్ష్ రోషన్ కి, శ్రీదేవికి మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమా ద్వారా ఫేమస్ అయిన శ్రీదేవి తాజాగా పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. 

తాజాగా రాఖీ పండుగ సందర్భంగా శ్రీదేవి రాఖీ కడుతున్న సమయంలో మెడలో పసుపు తాడు వేసుకొని కనిపించింది. అయితే కొత్తగా పెళ్లైన వారి మెడలో ఇలాంటి పసుపు తాడు కనిపిస్తుంది. అయితే అలాంటి తాడే శ్రీదేవి మెడలో కూడా కనిపించడంతో చాలామంది ఇదేంటి శ్రీదేవి పెళ్లి చేసుకుందా.. మెడలో ఆ పసుపు తాడు ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరి కొంతమందేమో శ్రీదేవి ఏదైనా కొత్త సినిమాలో నటిస్తుంది కావచ్చు.అందుకే అలా మెడలో పసుపు తాడుతో కనిపించింది అని కామెంట్స్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: