
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎప్పుడు మీడియా కంట కనబడిన రిపోర్టర్స్ అడిగే మొదటి ప్రశ్న "ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..?" . రీసెంట్ గా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కాకినాడలోని ద్రాక్షారామం టెంపుల్ ని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడారు . ఇదే మూమెంట్లో ప్రభాస్ పెళ్లికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు . అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ప్రభాస్ పెళ్లి గురించి రిపోర్టర్స్ ప్రశ్నించగా .."ప్రభాస్ పెళ్లి అవుతుంది అని ..కచ్చితంగా జరుగుతుంది అని "ఆమె ఆన్సర్ ఇచ్చారు.
" ఎవరిని చేసుకుంటారు..? హీరోయిన్ నా..? లేకపోతే మీ బంధువుల అమ్మాయినా..? అంటే ..ఆమె ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తూ .."అదంతా దేవుడు చేతుల్లోనే ఉంటుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు . ఆ శివుడు ఆజ్ఞ ఎప్పుడు ప్రభాస్ పై పడితే అప్పుడు ఆయన పెళ్లి జరుగుతుంది " అంటూ టోటల్ బాధ్యత శివయ్య పై వేసేసారు . చాలామంది ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క - ప్రభాస్ లవ్ లో ఉన్నారు అని నమ్ముతున్నారు . కానీ వాళ్ళు ఆ విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూనే వస్తున్నారు. మరి ఎందుకు ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు ..? అనుష్క ఎందుకు పెళ్లి చేసుకోలేదు ..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ . వీళ్లిద్దరిలో ఎవరో ఒక్కరికైనా పెళ్లి అయితే ఈ ప్రశ్నలకు ఆన్సర్ దొరుకుతుంది . చూద్దాం మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో..? ఎవరిని చేసుకుంటాడో..?? కాలమే దీనికి సమాధానం చెబుతుంది..!