
సినిమా విడుదలైన రోజు నుంచి 23/8/2025 తేదీ వరకు మల్టీప్లెక్స్ లలో రూ .100 రూపాయలు సింగిల్ స్క్రీన్ రూ.75 రూపాయల టికెట్ పెంచుకొనేలా అనుమతులను జారీ చేశారు. ఈ టికెట్ల రేట్ల పెంపు జీవో పైన ఎన్టీఆర్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు కూడా ప్రత్యేకించి మరి ధన్యవాదాలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది.
వార్ 2 సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. మొదటిసారి ఇద్దరు స్టార్ హీరోలు ఓకే సినిమాలో నటించడమే కాకుండా ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు కనుక ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి పోటీగా రజనీకాంత్ నటిస్తున్న కూలి సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి కూడా ఇప్పటికే చాలా ప్రాంతాలలో టికెట్లు భారీగానే అమ్ముడుపోయినట్లు వినిపిస్తున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.