అదేంటి పవన్ కళ్యాణ్ స్వయంగా చెంపలు వాయించుకుని కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? ఆయన అంత పెద్ద తప్పు ఏం చేశారు... ఎందుకు చెంపల మీద కొట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు అని చాలామంది ఆయన అభిమానులు గాబరాపడుతూ ఉంటారు. అయితే చాలామంది తప్పు చేసిన సమయంలోనే ఛ.. ఇంత పెద్ద తప్పు చేసామా అన్నట్లుగా తమ చెంపలు తామే గట్టిగా కొట్టుకొని ఏడ్చేస్తూ ఉంటారు.అయితే ఇలాంటి పనే పవన్ కళ్యాణ్ కూడా చేశారట. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఈ పని చేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ తన రెండు చెంపలు వాయించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారంటే చాలామంది నిజ జీవితంలో అనుకుంటారు. కానీ ఆయన నిజ జీవితంలో కాదు ఓ సినిమా కోసం అలా చేశారట. అదే సుస్వాగతం.. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దేవయాని హీరోయిన్ గా వచ్చిన సుస్వాగతం సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అమాయకపు యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయ్యారు.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో నటించిన రఘువరన్ క్లైమాక్స్లో చనిపోతారు.అయితే ఈ క్లైమాక్స్ లో తండ్రి చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అవుతారు. తండ్రి చనిపోయిన బాధలో ఉండి తినడానికి కూడా ఇష్టపడరు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తన రెండు చెంపల మీద కొట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు.అయితే ఈ సీన్ కోసం పవన్ కళ్యాణ్ నిజంగానే చెంపల మీద గట్టిగా కొట్టుకొని నిజమైన కన్నీళ్లు కార్చారట. అయితే చాలా సినిమా షూటింగ్స్ లో కన్నీరు రావడం కోసం గ్లిజరిన్ వాడతారు.

 కానీ సుస్వాగతం సినిమా క్లైమాక్స్ సీన్ కోసం పవన్ కళ్యాణ్ రియల్ గా ఏడ్చారని ఆయన తన చెంపల మీద గట్టిగా కొట్టుకున్నారంటూ ఈ సినిమా దర్శకుడు అయినటువంటి భీమినేని శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.. పవన్ కళ్యాణ్ డెడికేషన్ ఎలా ఉంటుందో ఈ ఒక్క సీన్ తో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన పవన్ కళ్యాణ్ ని పొగిడారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం మూవీ మొదట చిరంజీవి గారి దగ్గరికి వెళ్లిందని,కానీ చిరంజీవిసినిమా నాకంటే తమ్ముడికి బాగా సెట్ అవుతుందని చెప్పడంతో అన్నవరం సినిమా పవన్ కళ్యాణ్ తో తీశామంటూ ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఆర్.బి.చౌదరి నిర్మాతగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సుస్వాగతం సినిమా అద్భుతమైన హిట్ అయింది. ఇందులోని పాటలు,తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ ఇలా ప్రతి ఒక్క సీన్స్ సినీ ప్రేక్షకులను అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: