కేవలం కొద్ది గంటల్లోనే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది అన్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా చూడటానికి జనాలు ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా పలు వార్తల ద్వారా మనం వింటూనే ఉన్నాం. అయితే ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో ఇప్పుడు కూలీ సినిమా చూడటానికి రజినీకాంత్ ఫ్యాన్స్ తంటాలు పడి మరి సిద్ధమవుతున్నారనే వార్త ట్రెండ్ అవుతోంది. ఏ అభిమాని అయిన ..ఎవరైనా సరే, తమ ఫేవరెట్ హీరో నటించిన సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షోలో చూడాలనే కోరిక ఎప్పుడూ ఉంటుంది.
 

ఆ అవకాశం దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోరు. అయితే రేపు గురువారం వర్కింగ్ డే కావడంతో, రజినీకాంత్ అభిమానుల్లో కొంతమంది ఫస్ట్ డే మూవీ చూడలేకపోవచ్చు. ముఖ్యంగా వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సెలవులు ఇబ్బంది కావచ్చు. కానీ రజినీకాంత్ ఫ్యాన్స్ అంతకంటే తెలివైనవాళ్లు. ముందుగానే సిక్ లీవ్ అప్లై చేసి, కూలీ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడటానికి ప్లాన్ చేస్తున్నారట. ఒకటి కాదు, రెండు కాదు — ఏకంగా 20, 30 కంపెనీల్లో ఉన్న ఉద్యోగులు ఇలా సిక్ లీవ్స్ వేస్తున్నారని సమాచారం. ప్రతి ఒక్కరూ “వైరల్ ఫీవర్” అనే ఒకే కారణం చూపించి సెలవు అప్లై చేస్తున్నారు.



దీంతో “ఏంటీ ఇది?” అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రజినీకాంత్ ఫ్యాన్స్ అంటే మామూలు కాదని మరోసారి రుజువైంది. ఏం చేసినా సరే, తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే చూడటానికి సిద్ధపడతారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగాలను సైతం పక్కన పెట్టి, కూలీ సినిమా చూడటానికి ముందుకు వెళ్తున్నారు. ఈ విషయం తెలిసి కొంతమంది ఆశ్చర్యపోతూ — “రజినీకాంత్‌కి ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారా?” అని అంటున్నారు. చూడాలి మరి రజనీకాంత్ నటించిన ఈ కూలీ సినిమా ఫ్యాన్స్ ని ఏ విధంగా సాటిస్ఫై చేస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: