
ఇటీవలె `కుబేర`తో భారీ విజయాన్ని అందుకున్న శేఖర్ కమ్ముల.. తన తదుపరి చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నానితో చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. స్టోరీ కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. శేఖర్ కమ్ముల చిత్రంలో నానికి జోడిగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించబోతుందట. ఇప్పటికే నాని, సాయి పల్లవి కాంబోలో `మిడిల్ క్లాస్ అబ్బాయి`, `శ్యామ్ సింగరాయ్` చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించాయి.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జత కట్టబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఇటు నాని, ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో రణవీర్ కపూర్ కి జోడిగా `రామాయణం` సినిమాలో నటిస్తోంది. ఇది ఫినిష్ అయ్యాక శేఖర్ కమ్ముల, నాని ప్రాజెక్ట్ లో ఆమె భాగం కానుందని అంటున్నారు. ఇది మరి ఎంతవరకు నిజమో చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు