జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో వార్ 2 అనే హిందీ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని రేపు అనగా ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఇద్దరు హీరోలు నటించడం , అలాగే వార్ మూవీ ఇప్పటికే మంచి విజయం సాధించి ఉండడంతో వార్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి ఫ్రీ సేల్స్ ద్వారా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు దక్కుతున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు వార్ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రీ సేల్స్ ద్వారానే 20 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ ప్రీ సేల్స్ ద్వారానే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఇప్పటికే రాబట్టినట్లు సమాచారం. ఒక వేళ ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు కనుక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా సూపర్ సాలిడ్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు రాబట్టడం మాత్రమే కాకుండా లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరి ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి టాక్ వస్తుందో ... ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందింది. దానితో ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. మరి ఈ సినిమాలోని యాక్షన్స్ సన్ని వేషాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: