టాలీవుడ్ హీరోయిన్ తమన్నా దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్ గా అలరిస్తూనే ఉంది. తన నటనను ప్రతి సినిమాతో ప్రూఫ్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. గ్లామర్ షో పరంగా కూడా తమన్నా తగ్గేదే లేదు అనిపించుకుంటోంది ఈమధ్య. తమన్నా స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది అంటే చాలు కచ్చితంగా ఆ సినిమాకి భారీ హైప్ ఏర్పడుతుంది. సౌత్ ఇండస్ట్రీలోనే తమన్నాకు ప్రత్యేకించి క్రేజీ ఉన్నది.. మొదట శ్రీ సినిమాతో తన కెరీయర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హ్యాపీడేస్ చిత్రంతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.



అలా ఇప్పటికీ చిత్రాలలో నటిస్తున్న తమన్నా ఈ ఏడాది ఓదెల 2 చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. కానీ కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్ తమన్నాను సైడ్ చేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం సీనియర్ హీరోలతో నటించడమే తప్ప పాన్ ఇండియా స్టార్స్ తో నటించే అవకాశాలు మాత్రం కనిపించలేదు. ఓదెల2 సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం బాగానే అవకాశాలు అందుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి.


ఇప్పటికే అక్కడ రెండు చిత్రాలను సెట్స్ మీదికి తీసుకువెళ్లిన తమన్నా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అందుకే బాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇక సౌత్లో తమన్నా కెరియర్ దాదాపుగా ముగిసినట్టే అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా తమన్నా బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టాలని చూస్తోంది అంటూ తెలుపుతున్నారు. బాలీవుడ్ లో వస్తున్నా అవకాశాలు తెలుగులో ఇవ్వడం లేదన్నట్లుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందీలో ఎలాంటి పాత్ర వచ్చిన సరే తమన్నా ఒప్పుకుంటుందట కానీ తెలుగులో మాత్రం అలా కనిపించడం లేదని వినిపిస్తోంది. అయితే తరచూ ఈ మధ్య సినిమాలలో కంటే తన లవ్ బ్రేకప్ విషయం పైన ఎక్కువగా వినిపిస్తోంది తమన్నా పేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: