
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు భారీ సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటంతో పండగ వాతావరణం నెలకొంది. హీట్ మాత్రం మామూలుగా లేదు. ‘వార్ 2’, ‘కూలీ’ — ఈ రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే అయినా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చూపిస్తున్న హంగామా మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. రెండు సినిమాలు కూడా మొదటి రోజే సాలిడ్ వసూళ్లు అందుకునే అవకాశాలు ఉన్నాయని అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘వార్ 2’కి నెగిటివ్ టాక్, ‘కూలీ’కి పాజిటివ్ టాక్ రావడంతో చాలామంది ‘కూలీ’ పెద్ద రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందని భావిస్తున్నారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం వేరే లెక్కలు చెబుతున్నాయి.
వారి లెక్కల ప్రకారం.. ‘వార్ 2’ మొదటి రోజే ఎక్కువ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ దాదాపు ₹15 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, ‘వార్ 2’కి 20 కోట్లకు పైగా షేర్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా సమాచారం. నెగిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా టాప్ పొజిషన్‌లో ఉందని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ ₹44 కోట్ల బిజినెస్ చేస్తే, జూనియర్ ఎన్టీఆర్–హృతిక్ రోషన్‌ల ‘వార్ 2’ మాత్రం దాదాపు డబుల్ రేంజ్‌లో ..దాదాపు ₹90 కోట్ల బిజినెస్ టార్గెట్‌తో రాబోతోంది. చూడాలి మరి ‘వార్ 2’, ‘కూలీ’ — ఈ రెండింటిలో బాక్సాఫీస్‌ని ఎవరు షేక్ చేస్తారో..???