
ఓవర్సీస్ టాక్ ప్రకారం ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా నటించారట. కియారా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అయింది. సలాం అనాలి సాంగ్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉంది. అయితే స్పై యాక్షన్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఇప్పటికే ఒక ఐడియా ఉంది. వార్2 మూవీ కూడా అదే జానర్ మూవీ కావడంతో కథ, కథనం నుంచి మరీ అద్భుతాలు అయితే ఆశించలేము.
దాదాపుగా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం టాప్ రేంజ్ లో లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికే మనం గతంలో చూసిన చాలా సినిమాలను గుర్తు చేస్తాయని చెప్పవచ్చు. అయితే దేవర సినిమా కూడా యావరేజ్ టాక్ తో మొదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే సంగతి తెలిసిందే.
వార్2 సినిమా విషయంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా విజువల్ ఫీస్ట్ కానుందని చెప్పవచ్చు. ఫ్యాన్స్ కోరుకునే అంశాలు మాత్రం సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. వార్2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.