టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 అనే హిందీ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో తారక్ తో పాటు హృతిక్ రోషన్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని నిన్న అనగా ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమాలో తారక్ లాంటి భారీ క్రేజ్ ఉన్న నటి నటులు  నటించడంతో ఈ సినిమాకు మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది.

ఇకపోతే మరికొన్ని రోజులు కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కే అవకాశాలు బలంగా ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.  తాజాగా ఈ మూవీ ఓ టి టి హక్కులను ఎవరు దక్కించుకున్నారు ..? ఈ సినిమా ఎప్పటి నుండి ఓ టీ టీ లో స్ట్రీమింగ్  కానుంది అనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు , అందులో భాగంగా ఈ సినిమాను ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ మొదటి వారంలో లేదా రెండవ పారంలో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ఏ సంస్థ దక్కించుకుంది..? ఎప్పటి నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతుంది అనే వివరాలు తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: