ఏంటి వార్-2 మూవీలో బాలకృష్ణపై ఎన్టీఆర్ నిజంగానే సెటైర్లు వేశారా..తన లోపల ఉన్న కోపాన్నంతా ఈ విధంగా పరోక్షంగా బయట పెట్టారా..ఇంతకీ ఎన్టీఆర్ బాలకృష్ణపై వేసిన ఆ సెటైర్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..గత కొద్ది రోజులుగా బాలకృష్ణకి ఎన్టీఆర్ కి మధ్య పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారని, ఎన్టీఆర్ ఎంత దగ్గర కావాలని చూసినా కూడా ఆయన మాత్రం పక్కన పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వార్తలు వినిపించడమే కాదు ప్రత్యక్షంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్నాయి కూడా..ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన వార్ టు మూవీలో ఎన్టీఆర్ బాలకృష్ణపై సెటైర్ వేసినట్టు ఒక రూమర్ వినిపిస్తోంది.

ఇక విషయంలోకి వెళ్తే..యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మాతగా చేసిన వార్ -2 మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్లు నటించారు. ఒకరు ఎన్టీఆర్ మరొకరు హృతిక్ రోషన్.. స్టార్ ల కాంబోలో సినిమా అంటే ఏ లెవెల్ లో ఉంటుందో ఊహించనక్కర్లేదు. అయితే వార్ -2 మూవీ ఊహించినంత అయితే లేదు అని నెటిజన్ల టాక్.. ముఖ్యంగా ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించలేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది.అలా మిక్స్డ్ టాక్ తో విడుదలైన ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్లు భారీగానే వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం పక్కన పెడితే వార్ టు మూవీలో బాలకృష్ణ పై జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా సెటైర్లు వేసారంటూ ఒక రూమర్ వినిపిస్తోంది. 

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒంటరి పోరాటం చేస్తూ అందరికీ దూరమవుతూ అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. అయితే ఈ డైలాగ్ ఎన్టీఆర్ పరోక్షంగా బాలకృష్ణని ఉద్దేశించే అన్నారు అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ఈ డైలాగ్ మాత్రమే కాదు రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తాత ఎన్టీఆర్  దయ, చూపు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఆపలేరు.. నేను ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడానికి మా తాతయ్య మా నాన్న ఇద్దరూ ఎంతగానో సహకరించారు అంటూ చెప్పుకోచ్చారు. అయితే ఇందులో బాలకృష్ణ పేరుని చెప్పలేదని నందమూరి అభిమానులు తెగ ట్రోలింగ్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: