టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితమే  అధికారికంగా ప్రకటించారు. తేజ ఆఖరుగా హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాతో తేజ కు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత తేజ నటిస్తున్న సినిమా కావడంతో మిరాయ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన హిందీ యొక్క థియేటర్ హక్కులను అమ్మి వేశారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. 

మూవీ యొక్క హిందీ హక్కులను ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. హిందీ సినీ పరిశ్రమలో ధర్మ ప్రొడక్షన్స్ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. దానితో మిరాయ్ సినిమా యొక్క హిందీ హక్కులను ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ వారు దక్కించుకోవడంతో ఈ మూవీ హిందీ లో అద్భుతమైన రీతిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని , ఈ సినిమాకు హిందీ ఏరియాలో మంచి టాక్ గనుక వస్తే ఈ సినిమాకు హిందీ ఏరియా నుండి భారీ కలెక్షన్లు దక్కే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత మిరాయ్ సినిమాతో తేజ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: