
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందులో సగానికి పైగా టాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. కానీ ఇప్పటివరకు కోలీవుడ్‌కు చెందిన ఒక్క సినిమাও 1000 కోట్ల క్లబ్‌లో చేరలేదు. ఆ కోరికను తీర్చుతుందనే నమ్మకంతో, ఆగస్టు 14న విడుదలైన ‘కూలీ’ సినిమాపై తమిళనాడు ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా ఫలితం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. సినీ ప్రముఖుల అంచనాల ప్రకారం, ‘కూలీ’ బాక్సాఫీస్ కలెక్షన్లు 600–700 కోట్ల మధ్యే ఆగే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఎంత హిట్ చేసినా, గరిష్టంగా 900 కోట్ల వరకు వెళ్లవచ్చు కానీ 1000 కోట్ల క్లబ్‌లో చేరడం అసాధ్యమని సినీ విశ్లేషకులు అంటున్నారు.
దాంతో, రజనీకాంత్ కూడా తమిళనాడు ప్రజల చిరకాల కోరికను తీర్చలేకపోయినట్టే అయింది. హింది మార్కెట్లలో బలమైన అడుగులు వేసేలా, అన్ని భాషల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా కంటెంట్ ఉంటే మాత్రమే ఏ సినిమా అయినా సులభంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరగలదని నిపుణులు చెబుతున్నారు. గతంలో సూర్య హీరో గా నటించిన "కంగువ" సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు కోలీవుడ్ జనాలు. కానీ ఈ సినిమా అసలకే మోసం చేసింది. డిజాస్టర్ కా బాప్ అనేలా ట్యాగ్ చేయించుకుంది. పరమ దారుణమైన కలెక్షన్స్ అందుకుంది..!!