మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతుంది. రవితేజకు ఆఖరుగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా ద్వారా విజయం దక్కింది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తర్వాత రవితేజ నటించిన చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ అందులో ఏ సినిమా కూడా కనీసం యావరేజ్ విజయాన్ని కూడా సొంతం చేసుకోలేదు. దానితో ప్రస్తుతం రవితేజ కెరియర్ కాస్త కష్ట కాలంలోనే నడుస్తుంది. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రవితేజ , శ్రీ లీల కాంబోలో రూపొందిన ధమాకా మూవీ మంచి విజయం సాధించడంతో మరోసారి వీరి కాంబోలో రూపొందుతున్న మాస్ జాతర సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని రవితేజ తిరిగి అదిరిపోయే హిట్ మూవీతో కం బ్యాక్ ఇస్తాడు అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

మాస్ జాతర మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. కానీ ఆ తర్వాత ఈ మూవీ విడుదల కు సంబంధించి పెద్దగా అప్డేట్లు ఏమీ రాలేదు. కొంత కాలం క్రితం ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కొంత కాలం ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. కానీ ఈ మూవీ బృందం మాత్రం ఆ వార్తలను పట్టించుకోకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేయడం , పాటలను విడుదల చేయడం , తాజాగా టీజర్ను కూడా విడుదల చేయడంతో ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు.

కచ్చితంగా ఈ సినిమా ఆగస్టు 27 వ తేదీన విడుదల అవుతుంది అని రవితేజ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాంటి సమయం లో మరో సారి ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని బలమైన వార్తలు వస్తున్నాయి. దానితో రవితేజ ఫాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఒక వేళ ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ కానట్లయితే ఈ మూవీ బృందం ఒక సారి స్పందించి ఈ మూవీ ఆగస్టు 27 వ తేదీన పక్కాగా విడుదల కానుంది అని అనౌన్స్ చేసినట్లయితే రవితేజ ఫ్యాన్స్ ఖుషి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt