సౌందర్య జగపతిబాబు మధ్య ఎలాంటి బాండింగ్ ఉండేదో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా జగపతిబాబుకి సౌందర్య అంటే చాలా ఇష్టమని సౌందర్యని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, ఆ మధ్యకాలంలో ఎప్పుడు రూమర్లు వినిపించాయి. అంతేకాదు సౌందర్య చనిపోయాక జగపతిబాబు చాలా ఏడ్చారని, ఆయన కూడా చనిపోదామని రచ్చ రచ్చ చేసారంటూ కొన్ని రూమర్లు కూడా వినిపిస్తాయి. అయితే జగపతిబాబు పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో సౌందర్య తో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురవుతాయి. దాని గురించి జగపతిబాబు కచ్చితంగా స్పందిస్తారు. అయితే అలాంటి జగపతి బాబు సౌందర్య నటించిన సినిమాలో అదే నాకు చివరి రోజు అనుకున్నారట.మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఎందుకు అలా అనుకున్నారు అనేది చూస్తే..

సౌందర్య,సాయికుమార్,ప్రకాష్ రాజ్, జగపతిబాబు వంటి వాళ్లు నటించిన అంతః పురం సినిమా అందరూ చూసే ఉంటారు. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గొడవల నేపథ్యంలో తెరకెక్కిన అంతఃపురం సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో అప్పట్లోనే కృష్ణవంశీ రాయలసీమలో ఉండే ఫ్యాక్షన్ గొడవల గురించి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో జగపతిబాబు,సౌందర్య, ప్రకాష్ రాజ్ నటనని మెచ్చుకోని వారు ఉండరు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అద్భుతంగా చేశారు. అయితే అలాంటి ఈ సినిమాలో జగపతిబాబు కి సౌందర్య తో ఎలాంటి రిలేషన్ లేకున్నా కూడా ఆమెకు హెల్ప్ చేసే పాత్రలో కనిపిస్తారు.అయితే ఈ సినిమా క్లైమాక్స్లో సౌందర్య కోసం జగపతి బాబు చాలానే ఫైట్లు చేసి రక్షిస్తాడు.ఆ టైంలో చాలానే దెబ్బలు తిని కనిపిస్తాడు. అయితే ఈ క్లైమాక్స్ సీన్ తెరకెక్కించేటప్పుడు కృష్ణవంశీ అందులో చాలా లీనమైపోయారట.

దాంతో కట్ చెప్పడం కూడా మర్చిపోయి కథలో మునిగిపోవడంతో జగపతిబాబు దాదాపు చచ్చిపోయాను అనుకున్నారట. ఆ తర్వాత కృష్ణవంశీ తేరుకొని కట్ చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడట  అయితే ఈ సీన్ చేసినప్పుడు అదే నాకు చివరి రోజు దాదాపు చచ్చిపోయాను అనుకున్నాను అంటూ జగపతిబాబు తాజాగా యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు.అంతేకాకుండా తెల్లబడిన జుట్టుతో ఎందుకు మీరు అలాగే కనిపిస్తారు అని కొంతమంది ప్రశ్నలు అడగగా.. దానికి కూడా సమాధానం ఇచ్చారు. నాకు ఇలా న్యాచురల్ గా ఉండడం అంటేనే ఇష్టం. నా జుట్టుకి రంగు ఎందుకు వేయనని ఎంతోమంది అడుగుతున్నారు. కానీ నాకు ఇప్పటివరకు ఈ జుట్టు ఉండడమే అదృష్టం అనుకుంటాను.అందుకే తెల్ల జుట్టుకి రంగు వేయడం ఇష్టం లేదు.అంతేకాకుండా చచ్చిపోయే వరకు ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటాను. ఎందుకంటే నాకు పెద్ద కోరికలు ఏమీ లేవు అంటూ జగతిబాబు చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: