టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరో గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై బారి స్థాయిలో అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. అది ఎందుకు అనుకుంటున్నారా ..? సాధారణంగా ఒక హీరో , ఒక దర్శకుడి కాంబినేషన్లో ఏదైనా సినిమా వచ్చి అది అద్భుతమైన విజయం సాధించినట్లయితే ఆ తర్వాత వారిద్దరి కాంబోలో మరో మూవీ రానున్నట్లయితే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో సాధారణంగా భారీ స్థాయిలో అంచనాలు నెలకొనే అవకాశం ఉంటుంది.

వెంకటేష్ హీరో గా రూపొందిన సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించకపోయిన వెంకటేష్ హీరో గా రూపొంది అద్భుతమైన విజయం సాధించిన ఓ రెండు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్ , విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయిత , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు.

ఆ తర్వాత వెంకటేష్ హీరో గా విజయ భాస్కర్ దర్శకత్వంలో కత్రినా కైఫ్ హీరోగా రూపొందిన మల్లీశ్వరి సినిమాకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వెంకటేష్ కెరియర్లో మంచి విజయం సాధించిన రెండు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. ఈ రెండు మూవీలు మంచి విజయాలు సాధించడంతో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలను నెలకొనే అవకాశం ఉంటే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: