ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 మూవీలతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను అందుకున్నాడు. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రమోషనల్ వీడియోలను మేకర్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ ప్రమోషనల్ వీడియోల ద్వారా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ సినిమాగా తెలిసిపోతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... బన్నీ హీరో గా అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో రమ్యకృష్ణ నటించబోతున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించగా ఆమె కూడా ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

రమ్యకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో రమ్యకృష్ణకు ఈ మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది. ఇకపోతే దర్శకుడు అట్లీ ఆఖరుగా షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మూవీకి దర్శకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: